Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa dhehamunu nee aalayamugaa nirminchi nivasinchumu

నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము

Naa dhehamunu nee aalayamugaa nirminchi nivasinchumu

Lyricist: Joel Kodali
Verse
నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు
యేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమే
యేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే
నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము
నా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెద
ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును
నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము
నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని అణువణువు చిగురించును
ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను విస్తారముగా దేవా ఫలియింతును
నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా
ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు

Related Tags

WorshipDedicationHoly Spirit