Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Geethaaraadhanalo

నా గీతారాధనలో

Naa Geethaaraadhanalo

Lyricist: Hosanna Ministries
Verse
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ‖ 2x నా గీతా ‖
Verse
నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే‖ 2x ‖
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే‖ 2x నా గీతా ‖
Verse
చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే‖ 2x ‖
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే‖ 2x నా గీతా ‖
Verse
ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే‖ 2x ‖
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై‖ 2x నా గీతా ‖

Related Tags

PraiseWorshipGrace