Verse
నా గీతారాధనలో-యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో-జనించెనే నీ కృపాదరణ
Verse
నీ కృప నాలో వ్యర్థము కాలేదు- నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే
నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే‖ నా గీతా ‖
Verse
చేనిలోని పైరు చేతికిరాకున్నా- ఫలములన్ని రాలిపోయిన
సిరిసంపదలన్నీ దూరమైపోయిన-నేను చల్లించనులే
నిశ్చలమైన రాజ్యముకొరకే- ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే‖ నా గీతా ‖
Verse
ఆత్మాభిషేకం-నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే
ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు-నే వేచియుందునే నీ రాకడకై‖ నా గీతా ‖