Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Gudaaramu Kshemamani Naaku Thelipithivi

నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి

Naa Gudaaramu Kshemamani Naaku Thelipithivi

Lyricist: Deevenaiah
Verse
నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి‖ 2x ‖
నా ఇంటి వస్తువులు లెక్క చూడగా‖ 2x ‖
ఏదియు నాకు నష్టముండదు‖ 2x Naa Gudaaramu ‖
Verse
కంచె వేసితివి నా చుట్టు నీవు
ఘనముగా చెప్పితివి నా విషయమై‖ 2x ‖
రాజ్యములు జయించితిని విశ్వాసముతో‖ 2x ‖
కృప వెంబడి కృప చూపుచుండగా‖ 2x ‖
Verse
నా కుటుంబీకులు పచ్చిక వలెను
విస్తారమగును నా సంతానము‖ 2x ‖
ఆకు వాడక తన కాలమందున‖ 2x ‖
ఫలమిచ్చుఁ చెట్టు వలె నేనుందును‖ 2x ‖
Verse
పితరులు చూడని వాగ్ధాన ఫలమును
అనుభవించుచుంటిని నీ దయతో‖ 2x ‖
విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు‖ 2x ‖
మరి శ్రేష్ఠమైన దేశము చేరెదను‖ 2x ‖
Verse
ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు
పూర్ణ వయస్సుతో నేను నిన్ను చేరెద‖ 2x ‖
నా చేతి పనులన్ని సఫలము చేసి‖ 2x ‖
ఆశీర్వాదము నా సొత్తు చేసితివి‖ 2x ‖
Verse
యాత్రికుడనై పరదేశిగా నేను
నివసించుచుంటిని గుడారాలలో‖ 2x ‖
మరి శ్రేష్ఠ పునరుత్తానం పొందుటకై‖ 2x ‖
మరచిపోతిని నా జన్మ భూమిని‖ 2x Naa Gudaaramu ‖

Related Tags

FaithBlessingTrust