Verse
నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని
నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని‖ 2x ‖
పదే పదే పాడుతుంది నా నాలుకా‖ 2x ‖
నీకే నా ఆరాధనా యేసయ్యా
నీకే నా ఆరాధనా‖ 2x ‖
Verse
నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా
నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా‖ 2x ‖
నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు
కేవలం నీ కృపయే‖ 2x నా గుండె ‖
Verse
నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు
నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు‖ 2x ‖
నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట
నాకెంత భాగ్యము‖ 2x నా గుండె ‖