Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Hrudayamulo

నా హృదయములో

Naa Hrudayamulo

Lyricist: Hosanna Ministries
Verse
నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు‖ 2x ‖
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా‖ 2x నా హృదయములో ‖
Verse
మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి‖ 2x ‖
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు‖ నీ కార్యములను ‖
Verse
విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి‖ 2x ‖
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు‖ నీ కార్యములను ‖
Verse
పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు‖ 2x ‖
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు‖ నీ కార్యములను ‖

Related Tags

PraiseWorshipGrace