Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Hrudhayamulo Nee Maatale Naa Kanulaku Kanthirekhalu

నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు

Naa Hrudhayamulo Nee Maatale Naa Kanulaku Kanthirekhalu

Chorus
నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు‖ 2x ‖
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠినహృదయమును కరిగించినావు
నీ కార్యములను వివరింపతరమా ?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?
Verse
మనసులో నెమ్మదిని కలిగించుటకు
మంచువలె కృపను కురిపించితివి‖ 2x ‖
విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు
Verse
విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి‖ 2x ‖
అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు
Verse
పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు‖ 2x ‖
పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు

Related Tags

WorshipDevotionalGrace