Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevam Naa Sarvam

నా జీవం నా సర్వం

Naa Jeevam Naa Sarvam

Lyricist: Kripal Mohan
Verse
నా జీవం నా సర్వం నీవే దేవా‖ 2x ‖
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా‖ నా జీవం ‖
Verse
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి‖ 2x ‖
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును‖ 2x నా జీవం ‖
Verse
మరణము జయించి తిరిగి లేచితివి
నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి‖ 2x ‖
అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్
భూదిగంతము వరకు నే ప్రకటించెదన్‖ 2x నా జీవం ‖
Verse
నీవే నీవే నీవే దేవా‖ 4x ‖

Related Tags

WorshipSacrificeDevotion