Chorus
నా జీవం నా సర్వం నీవే దేవా
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా
Verse
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును
Verse
మరణము జయించి తిరిగి లేచితివి
నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి
అపురూప ప్రేమకై నీ సాక్షినై నిలిచెదన్
బుధిగంతము వరకు నే ప్రకటించెదన్
Outro
నీవే నీవే నీవే దేవా