Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevam Nee Krupalalo Daachithive Naa Jeevithakaalamanthaa

నా జీవం నీ కృపలో దాచితివే నా జీవితకాలమంతా

Naa Jeevam Nee Krupalalo Daachithive Naa Jeevithakaalamanthaa

Lyricist: Bro Yesanna
Chorus
నా జీవం నీ కృపలో దాచితివే - నా జీవితకాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం - నా ఆశ్రయం
నా జీవం నీ కృపలో దాచితివే
Verse
కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే‖ 2x ‖
కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచితివే‖ 2x ‖
Verse
వాగ్దానా భూమిలో మృతసముద్రపు భయము నన్ను వెంటాడెనే‖ 2x ‖
వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే‖ 2x ‖
Verse
స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా‖ 2x ‖
స్తుతియాగాముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే‖ 2x ‖

Related Tags

WorshipGraceShelter