Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevam Nee Krupalo

నా జీవం నీ కృపలో

Naa Jeevam Nee Krupalo

Lyricist: Hosanna Ministries
Verse
నా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం‖ నా జీవం ‖
Verse
పాపపు ఊబిలో పడి కృంగిన నాకు
నిత్య జీవమిచ్చితివే‖ 2x ‖
పావురము వలె నీ సన్నిధిలో
జీవింప పిలచితివే‖ 2x నా జీవం ‖
Verse
ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము
అడ్డురానే వచ్చెనే‖ 2x ‖
నీ బాహు బలమే నన్ను దాటించి
శత్రువునే కూల్చెనే‖ 2x నా జీవం ‖
Verse
కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే‖ 2x ‖
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే‖ 2x నా జీవం ‖
Verse
వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే‖ 2x ‖
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే‖ 2x నా జీవం ‖
Verse
స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా‖ 2x ‖
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే‖ 2x నా జీవం ‖

Related Tags

PraiseWorshipGrace