Verse
నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు‖ 2x ‖
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా‖ 2x ‖
Verse
నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి‖ 2x ‖
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి‖ 2x నా జీవిత ‖
Verse
నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి‖ 2x ‖
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి‖ 2x నా జీవిత ‖
Verse
నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి‖ 2x ‖
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు‖ 2x నా జీవిత ‖