Chorus
నా జీవిత కాలమంత
నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద
నీకిచ్చిన చాలునా
Chorus
యేసు నీదు మేలులకై
నే బదులుగా యేమిత్తును
నా దేహమే యాగముగా
అర్పించిన చాలునా‖ నా జీవిత ‖
Verse
నా బాల్యమంతా - నా తోడుగా నిలచి
ప్రతి కీడునుండి - తప్పించినావు
యవ్వన కాలమున - నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే - కొనసాగినావు
ఎన్నో శ్రమలు - ఆపదలన్నిటిలో
నను ధైర్యపరచి - నను ఆదుకున్నావు
యేసు నీవే - నీవే యేసు
నీవే నా - సర్వస్వమూ...‖ నా జీవిత ‖
Verse
కన్నీటి రాత్రులు - నే గదిపిన వెంటనే
సంతోష ఉదయాలు - నాకిచ్చినావు
హృదయాశలన్నీ - నేరవెర్చినావు
యొగ్యుడను కాక్నున్న - హెచ్చించినావు
ఎంతో ప్రేమ - మితిలేని కృపను
నాపై చూపించి - నను హత్తుకున్నావు
యేసు నీవే - నీవే యేసు
నీవే నా - ఆనందమూ...‖ నా జీవిత ‖