Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevitha Vyadhalandu Yese Jawaabu

నా జీవిత వ్యధలందు యేసే జవాబు

Naa Jeevitha Vyadhalandu Yese Jawaabu

Chorus
నా జీవిత వ్యధలందు యేసే జవాబు
యేసే జవాబు – ప్రభు యేసే జవాబు‖ 2x Naa Jeevitha ‖
Verse
తీరని మమతలతో ఆరని మంటలలో
ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే‖ 2x ‖
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను‖ Naa Jeevitha ‖
Verse
చీకటి వీధులలో నీటుగా నడచితిని
లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని‖ 2x ‖
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను‖ Naa Jeevitha ‖
Verse
హంగుల వేషముతో రంగుల వలయములో
నింగికి నేనెగిరి నేలను రాలితిని‖ 2x ‖
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను‖ Naa Jeevitha ‖

Related Tags

ComfortJesusHope