Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevitha Yaathralo

నా జీవిత యాత్రలో

Naa Jeevitha Yaathralo

Verse
నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకమునందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు‖ 2x నా జీవిత ‖
Verse
పలు విధ శోధన కష్టములు
ఆవరించియుండగా‖ 2x ‖
కలత చెందుచున్న హృదయమును
కదలక కాపాడుము‖ 2x నా జీవిత ‖
Verse
నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు‖ 2x ‖
నీదు కుడి హస్తములో నిత్యమున
నాకు సుఖ క్షేమముగా‖ 2x నా జీవిత ‖
Verse
ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా‖ 2x ‖
మారని వాగ్ధానములన్నియు
నే నమ్మి సాగెదను‖ 2x నా జీవిత ‖
Verse
ముందున్న సంతోషము తలంచి
నిందలను సహించి‖ 2x ‖
నీ సిలువను నే మోయుటకై
నీ కృప నాకీయుము‖ 2x నా జీవిత ‖
Verse
సీయోను యొక్క ఆలోచనతో
సదా నడిపించుము‖ 2x ‖
మహిమలో నీతోనే నిల్చుటకు
నా తండ్రి దయచూపుము‖ 2x నా జీవిత ‖

Related Tags

PrayerComfortRefuge