Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevithaanthamu

నా జీవితాంతము

Naa Jeevithaanthamu

Verse
నా జీవితాంతము
నీ సేవ చేతునంటిని
నే బ్రతుకు కాలము
నీతోనే నడుతునంటిని
నా మనవి వింటివి
నన్నాదుకొంటివి‖ 2x నా జీవితాంతము ‖
Verse
నీ ప్రేమ చూపించి
నన్ను నీవు పిలిచితివి
నీ శక్తి పంపించి
బలపరచి నిలిపితివి‖ 2x ‖
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా‖ 2x నా జీవితాంతము ‖
Verse
రోగముతో పలుమార్లు
పడియుండ లేపితివి
ఘోరమై పోకుండా
స్థిరపరచి కాచితివి‖ 2x ‖
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా‖ 2x నా జీవితాంతము ‖
Verse
దూషించు దుష్టులకు
సిగ్గును కలిగించితివి
వేలాది ఆత్మలకు
మేలుగ నన్నుంచితివి‖ 2x ‖
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా‖ 2x నా జీవితాంతము ‖
Verse
సంఘములు కట్టుటకు
సామర్ధ్యమిచ్చితివి
ఉపదేశమిచ్చుటకు
దేశములు తిప్పితివి‖ 2x ‖
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా‖ 2x నా జీవితాంతము ‖

Related Tags

DedicationFaithfulnessService