Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevithakaalamantha Ninu

నా జీవితకాలమంత నిను

Naa Jeevithakaalamantha Ninu

Verse
నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా
యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా అర్పించిన చాలునా‖ నా జీవిత ‖
Verse
నా బాల్యమంతా నా తోడుగ నిలిచి
ప్రతి కీడు నుండి తప్పించినావు
యవ్వనకాలమున నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే కొనసాగినావు
ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో
నను దైర్యపరిచి నను ఆదుకున్నావు
యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ‖ నా జీవిత ‖
Verse
కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే
సంతోష ఉదయాలు నాకిచ్చినావు
హృదయాశలన్ని నెరవేర్చినావు
యోగ్యుడను కాకున్న హెచ్చించినావు
ఎంతో ప్రేమ మితిలేని కృపను
నాపై చూపించి నను హత్తుకున్నావు
యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ‖ నా జీవిత ‖

Related Tags

WorshipDevotionGratitude