Verse
నా జీవితములో వెలుగై నిలిచినా
జోతిర్మయుడైన నా యేసురాజును
ఆత్మతో సత్యముతో ఆరాధించెదా
Verse
తండ్రి తనయునిపై జాలి పడినట్టుగా
తండ్రిగా నాపై జాలి చూపిస్తివే
కరుణమయుడైన నా యేసురాజుని
ఆత్మతో సత్యముతో ఆరాధించెదా
Verse
తల్లి మరచినా మరువనంటివే
శాశ్వత ప్రేమతో నను ప్రేమిస్తివే
ప్రేమామయుడైనా ఆ యేసునాధుని
ఆత్మతో సత్యముతో ఆరాధించెదా