Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Kaalagathu Levvi Naa Chaethulanu Le

నా కాలగతు లెవ్వి నా చేతులను లే

Naa Kaalagathu Levvi Naa Chaethulanu Le

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకే
వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు‖ నా ‖
Verse
తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను
మిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను‖ నా ‖
Verse
పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి
చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా‖ నా ‖
Verse
సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు
సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి‖ నా ‖
Verse
సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను
ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి‖ నా ‖

Related Tags

WorshipDevotionalGods Grace