Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Kanuchoopu Mera

నా కనుచూపు మేర

Naa Kanuchoopu Mera

Lyricist: Joshua Shaik
Verse
నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ
పొంగి పారెనే – పొంగి పారెనే‖ 2x ‖
నే ప్రేమింతును – నా యేసుని మనసారా‖ 2x ‖
ఆరిపోవు లోక ప్రేమల కన్నా
ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న‖ 2x నా కనుచూపు ‖
Verse
నా కన్నీటిని తుడిచినా ప్రేమ
నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ‖ 2x ‖
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ‖ 2x నా కనుచూపు ‖
Verse
నా దీన స్థితిని చూచిన ప్రేమ
తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ‖ 2x ‖
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ‖ 2x నా కనుచూపు ‖
Verse
నా భారంబును మోసిన ప్రేమ
సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ‖ 2x ‖
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ‖ 2x నా కనుచూపు ‖

Related Tags

PraiseWorship