Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa koarikalu theeripoaye priya yaesuloa

నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో

Naa koarikalu theeripoaye priya yaesuloa

Verse
నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో
నా ప్రాణప్రియుని యందు అవి తీరుచున్నవి
Verse
పెంటగ కనుపించె ఈ లోకమంతయు
ప్రభుని చూడ నా హృదయము ఆశపడినది
Verse
తీర్చును ఆకలిని జీవాహారంబుతో
తృప్తిని యిచ్చినాకు తన శాంతి నొసగును
Verse
తీర్చును నా దాహమును జీవజలంబుతో
నీరుకట్టిన తోటవలె వృద్ధి చేయును
Verse
బలహీనతలయందు తన బలమునిచ్చును
కొల్లగ శక్తి నిచ్చి విజయముతో నడుపును
Verse
నిరీక్షణను కలిగి స్వాస్థ్యమును పొందెదన్
నను పుత్రునిగా జేసి ఆనంద మొసగెను
Verse
వెలిగించె ప్రభువు నన్ను ఆత్మీయముగను
విలువైన నగరమందు నన్నుచేర్చుకొనును

Related Tags

JesusHope