Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Korakai Anniyu Chesenu

నా కొరకై అన్నియు చేసెను

Naa Korakai Anniyu Chesenu

Lyricist: Songs Of Zion
Verse
నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో‖ 2x ‖
నా కొరకై అన్నియు చేసినందులకు‖ 2x ‖
నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్‖ 2x నా కొరకై ‖
Verse
క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్‖ 2x ‖
క్షామం తీరే వరకు ఆ విధవరాలి‖ 2x ‖
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు‖ 2x నా కొరకై ‖
Verse
ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయవు‖ 2x ‖
వాటిని పోషించునట్టి పరమ పితా‖ 2x ‖
మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును‖ 2x నా కొరకై ‖
Verse
ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము‖ 2x ‖
అడవి పువ్వుల ప్రభు అలంకరింప‖ 2x ‖
తానె – నిశ్చయముగా అలంకరించును‖ 2x నా కొరకై ‖
Verse
రేపటి దినము గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు‖ 2x ‖
రేపు దాని సంగతులనదే చింతించున్‖ 2x ‖
ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును‖ 2x నా కొరకై ‖
Verse
ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా‖ 2x ‖
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్‖ 2x ‖
యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై‖ 2x నా కొరకై ‖

Related Tags

PraiseWorshipThanksgiving