Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Koraku Baliyaina

నా కొరకు బలియైన

Naa Koraku Baliyaina

Lyricist: Prabhu Kumar
Verse
నా కొరకు బలియైన ప్రేమ
బహు శ్రమలు భరియించె ప్రేమ‖ 2x ‖
కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ‖ 2x ‖
తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ‖ 2x ‖
క్రీస్తేసు ప్రేమ‖ నా కొరకు ‖
Verse
నా హృదయ యోచనే జరిగించె పాపము
నా క్రియల దోషమే నడిపించె పతనముకై‖ 2x ‖
ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా
నా ఘోర పాపముకై మరణించినావయ్యా
ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా‖ 2x ‖
నా మంచి యేసయ్యా‖ 2x నా కొరకు ‖
Verse
నీ సిలువ త్యాగము నా రక్షణాధారం
నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం‖ 2x ‖
అర్హతే లేని నాకై మరణించినావయ్యా
నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా
ఘనపరతు యేసయ్యా‖ 2x నా కొరకు ‖

Related Tags

RepentanceGood FridaySacrificeLove