Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Kosamaa

నా కోసమా

Naa Kosamaa

Lyricist: Emmy Raj
Verse
నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ ప్రాణ త్యాగము‖ 2x ‖
కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా‖ 2x నా కోసమా ‖
Verse
నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై‖ 2x ‖
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే‖ 2x ‖
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు‖ 2x నా కోసమా ‖
Verse
నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై‖ 2x ‖
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే‖ 2x ‖
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు‖ 2x నా కోసమా ‖

Related Tags

WorshipRepentanceSacrificeCalvary