Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Krupa Neeku Chaalani

నా కృప నీకు చాలని

Naa Krupa Neeku Chaalani

Lyricist: K Solmon Raju
Verse 1
నా కృప నీకు చాలని
నా దయ నీపై ఉన్నదని
నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని
నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
నాతో మాట్లాడిన మహోన్నతుడా
నన్నాదరించిన నజరేయ‖ 2x నా కృప ‖
Verse 2
నేను నీకు తోడైయున్నానని
పొంగే జలములు నిన్నేమి చేయలేవని‖ 2x ‖
నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును‖ 2x ‖
పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని‖ 2x నాతో ‖
Verse 3
పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని‖ 2x ‖
నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని‖ 2x ‖
జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని‖ 2x నాతో ‖

Related Tags

GraceComfortProtectionHoly Spirit