Verse
నా మార్గమందు నా కంటె ముందు
నడిచావయ్యా నా యేసయ్యా
పరలోకమందు నేనుండాలని
ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా‖ 2x ‖
Verse
నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి
సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి
అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి
మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి…
Chorus
(నా యేసయ్యా) కృప చేత రక్షించినావు
నన్ను… నీ సాక్షిగా నిలిపినావు‖ 2x ‖
Verse
నీ ప్రేమను – ప్రకటించుటకు
నీ చిత్తము – నెరవేర్చుటకు
నీ సేవలో – కొనసాగుటకు
నీ మహిమలో – నేనుండుటకు
Chorus
(నా యేసయ్యా) కృప చేత రక్షించినావు
నన్ను… నీ సాక్షిగా నిలిపినావు‖ 2x ‖
నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు –‖ 2x ‖