Chorus
నా మాట వినుమని ప్రభువనెను
నిను రక్షింపను పిలుచు చుండె
Verse
పాపుల రక్షకుడు యేసు ప్రభుండు
నీతిమంతుల కాదు పాపుల పిలిచెన్
నిను హృదయంబార ప్రేమించును - ప్రేమించును‖ 2x ‖
Verse
తప్పిన దారిని వెదకవచ్చెన్
తానే వెదకె నిన్ పరికించుము
దాపున నిలిచెను రక్షింపను - రక్షింపను‖ 2x ‖
Verse
జీవన దాతగా ప్రభు యేసు వచ్చెన్
నిత్య జీవము నీకు కలిగించును
కావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను‖ 2x ‖
Verse
జీవన జ్యీతిగా జగమున కొచ్చెన్
నీ వెరిగితివా నీ స్థితిని
నీ చీకటిని పోగొట్టును - పోగొట్టును‖ 2x ‖
Verse
పాత వాటిని పారగ ద్రోలన్
నూతన పరచును సర్వమును
పరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని‖ 2x ‖