Verse
నా మనో నేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి‖ 2x ‖
అంధకారములో నేనుండ‖ 2x ‖
వెదకి నన్ రక్షించితివి‖ 2x నా మనో ‖
Verse
నే పాప భారము తోడ
చింతించి వగయుచునుంటి‖ 2x ‖
కల్వరి సిలువలో నా శ్రమలన్‖ 2x ‖
పొంది నన్ విడిపించితివి‖ 2x నా మనో ‖
Verse
ఎన్నాళ్ళు బ్రతికిననేమి
నీకై జీవించెద ప్రభువా‖ 2x ‖
బాధలు శోధనలు శ్రమలలో‖ 2x ‖
ఓదార్చి ఆదుకొంటివయా‖ 2x నా మనో ‖
Verse
నీ సన్నిధిని నే కోరి
నీ సన్నిధిలో నే మారి‖ 2x ‖
స్తుతి పాత్రగ ఆరాధింతున్‖ 2x ‖
యుగయుగములు సర్వ యుగములు‖ 2x నా మనో ‖