Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Naanna Intiki

నా నాన్న యింటికి

Naa Naanna Intiki

Verse
నా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి‖ 2x ‖
నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది
నా నాన్న యింటిలో నాట్యమున్నది‖ నా నాన్న ‖
Verse
మగ్ధలేని మరియలాగా‖ 2x ‖
నీ పాదాలు చేరెదను‖ 2x ‖
కన్నీటితో నేను కడిగెదను‖ 2x ‖
తల వెంట్రుకలతో తుడిచెదను‖ 2x నా నాన్న ‖
Verse
బేతనీయ మరియలాగా
నీ సన్నిధి చేరెదను‖ 2x ‖
నీ వాక్యమును నేను ధ్యానింతును‖ 2x ‖
ఎడతెగక నీ సన్నిధి చేరెదను‖ 2x నా నాన్న ‖
Verse
నీ దివ్య సన్నిధి నాకు
మధురముగా ఉన్నదయ్యా‖ 2x ‖
పరలోక ఆనందం పొందెదను‖ 2x ‖
ఈ లోకమును నేను మరిచెదను‖ 2x నా నాన్న ‖

Related Tags

WorshipHeavenDevotion