Verse
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు‖ 2x ‖
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని‖ 2x ‖
పెన్నుగ నాలో నాటుమా ప్రేమన్‖ 2x నా నాథుడా ‖
Verse
దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్‖ 2x ‖
యావత్తు పెంటయనుచు నిదిగో‖ 2x నా నాథుడా ‖
Verse
ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా‖ 2x ‖
ఆశ కల్గించు నాలోన నీవే‖ 2x నా నాథుడా ‖
Verse
పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా‖ 2x ‖
కరుణతో నన్ను గావుమా యిప్పుడు‖ 2x నా నాథుడా ‖
Verse
భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి‖ 2x ‖
పాతకుడ నేనైతిని మహా‖ 2x నా నాథుడా ‖
Verse
ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ‖ 2x ‖
సదయుడా నన్ను చూడుమా యిపుడు‖ 2x నా నాథుడా ‖
Verse
హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను‖ 2x ‖
ఉల్లమందానంద ధ్వని యిదియే‖ 2x నా నాథుడా ‖