Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Neethi Neeve

నా నీతి నీవే

Naa Neethi Neeve

Lyricist: Bro Anil Kumar
Verse
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే
నా దైవమా యేసయ్యా
నా క్రియలు కాదు నీ కృపయే దేవా
నా ప్రాణమా యేసయ్యా
నదులంత తైలం విస్తార బలులు
నీకిచ్చినా చాలవయ్యా
నీ జీవితాన్నే నాకిచ్చినావు
నీకే నా జీవమయ్యా
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ‖ 4x నా నీతి ‖
Verse
నా దీన స్థితిని గమనించి నీవు
దాసునిగ వచ్చావుగా
నా దోష శిక్ష భరియించి నీవు
నను నీలో దాచావుగా
ఏమంత ప్రేమ నా మీద నీకు
నీ ప్రాణమిచ్చావుగా
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను
యజమానుడవు నీవేగా‖ హల్లెలూయ ‖
Verse
నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు
నీవు చేరదీసావుగా
నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి
కన్నీరు తుడిచావుగా
నేనున్న నీకు భయమేలనంటూ
ఓదార్పునిచ్చావుగా
చాలయ్య దేవ నీ కృపయే నాకు
బ్రతుకంతయు పండుగా‖ హల్లెలూయ ‖
Verse
ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు
నీవు నన్ను చూసావుగా
నీ చేయి చాపి నను పైకి లేపి
నీ వాక్కునిచ్చావుగా
నా సంకటములు నా ఋణపు గిరులు
అన్నిటిని తీర్చావుగా
నీలోన నాకు నవ జీవమిచ్చి
నీ సాక్షిగా నిలిపావుగా‖ హల్లెలూయ ‖

Related Tags

PraiseWorshipGrace