Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Nimiththamaayana Mahini Shramalu Pondhenu

నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను

Naa Nimiththamaayana Mahini Shramalu Pondhenu

Chorus
నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను
ఘనధనముల రోసెను అనుమతించె చావుకు
Verse
నా నిమిత్తమె (3) మరణ మాయెను‖ 3x ‖
తన జీవమును నాకు బలిగా ధారపోసెను‖ నా నిమి ‖
Verse
గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను
ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని‖ నా నిమి ‖
Verse
అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు
అయినను దేవుడు అతని నలుగగొట్టెను‖ నా నిమి ‖
Verse
అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్
క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా‖ నా నిమి ‖
Verse
రోగముల్ భరించెను వ్యసనములు వహించెను
బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను‖ నా నిమి ‖
Verse
గాయములను పొందెను కాయమంత నొచ్చెను
హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను‖ నా నిమి ‖
Verse
ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని
సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి‖ నా నిమి ‖
Verse
తన యనుభవమున్ మనల దోషరహితులన్
చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను‖ నా నిమి ‖

Related Tags

SacrificeAtonementSuffering