Verse
నా నోటన్ క్రొత్త పాట
నా యేసు ఇచ్చెను‖ 2x ‖
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా‖ 2x నా నోటన్ ‖
Verse
అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించెను‖ 2x ఆనందించెదను ‖
Verse
దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను‖ 2x ఆనందించెదను ‖
Verse
నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును‖ 2x ఆనందించెదను ‖
Verse
వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను‖ 2x ఆనందించెదను ‖
Verse
భువిలోని బాధలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచియున్నాను‖ 2x ఆనందించెదను ‖