Verse
నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు‖ 2x ‖
నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు
నీ సాక్షిగా నను నిలిపావు‖ 2x నా ఊహకందని ‖
Verse
అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని
దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే‖ 2x ‖
ఏనాడు అనుకోలేదు
నన్ను నీవు ఎన్నుకుంటావని‖ 2x నా ఊహకందని ‖
Verse
జీవితమంతా శూన్యమైపోగా
నాకున్న వారే నన్ను విడచిపోగా‖ 2x ‖
ఏనాడు అనుకోలేదు
నాకు తోడుగా నీవుంటావని‖ 2x నా ఊహకందని ‖
Verse
నా జీవితాన్ని నీవు మార్చినావు
నీ సేవలోనే నన్ను నిల్పినావు‖ 2x ‖
ఏనాడు అనుకోలేదు
నా జీవితం ఇలా మారుతుందని‖ 2x నా ఊహకందని ‖