Verse
నా పాపమే నిను లోకము చేర్చెను
నా దోషమే నిను సిలువను వేసెను‖ 2x ‖
నేనేగా పెంచితి నీ భారం
తండ్రికి నిను చేసితిని దూరం‖ 2x Naa Paapame ‖
Verse
ఆ గెత్సేమనే వనములోన నువ్వు చేసిన ఆ ప్రార్థనలో
నీ రుధిరము స్వేదము బిందువులుగా మారి ఎడతెగకుండా కురిసిన‖ 2x ‖
నువ్వు నలుగుట తండ్రి కోరెను
నా పాపము నీపై మోపెను‖ 2x ‖
నువ్వు చూపిన వినయమే కాదా?
నా పాలిట వెలకట్టని క్రయధనముగ మారెను‖ Naa Paapame ‖
Verse
ఆ సిలువలో, నీ బాధలలో చూచితిని నా పాపము
నీ ప్రేమతో కార్చిన రుధిరం చెల్లించేను నా మూల్యము‖ 2x ‖
ఈ మరణము నా కోసమే
నీ యాతన నా లోపమే‖ 2x ‖
ఏమున్నది నాలోన ఘనము
నీ ప్రాణము పెట్టి నన్ను చేర్చితివి పరము‖ Naa Paapame ‖