Chorus
నా పాపములను క్షమించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్
ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్
Verse
మలిన వస్త్రములతో నేను - చెడిన హృదయముతో నేను
కలువరి సిలువను చేరన్
Verse
మరణమునుండి నా ప్రాణమును - కన్నీటినుండి నా కన్నులను
తప్పించెను నా తండ్రి
Verse
నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదను
నా ప్రభు నా మొర వినును
Verse
యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయముగల దేవుండు
సాధువులను గాపాడున్
Verse
మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను
నా ప్రభునే స్తుతియింతున్
Verse
యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమను
జూపించన్ - బహుప్రియమున నన్ బిలచెన్