Verse 1
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
ఎవరైనా – మీలో ఎవరైనా‖ 2x ‖
వెళతారా – నా ప్రేమను చెబుతారా‖ 2x ‖
Verse 2
రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో‖ 2x ఎవరైనా ‖
Verse 3
నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు‖ 2x ఎవరైనా ‖
Verse 4
వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి‖ 2x ఎవరైనా ‖