Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praana Priyudaa Naa Yesayyaa

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా

Naa Praana Priyudaa Naa Yesayyaa

Lyricist: Palaparthi Prabhudas
Verse
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నను గన్న తండ్రి నా యేసయ్యా
పూజింతును ఓ పూజార్హుడా
భజియింతును ఓ భవదీయుడా
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా‖ 2x ‖
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము‖ నా ప్రాణ ‖
Verse
ఒంటరినై తోడులేక దూరమైతిని
ఓదార్చే వారు లేక భారమైతిని‖ 2x ‖
తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని‖ 2x ‖
నీ తోడు దొరికాక చిగురించితిని‖ 2x నీవు గాక ‖
Verse
శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
సూటిపోటి మాటలకు నలిగిపోతిని‖ 2x ‖
తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే
కష్టమంతయు తీరిపోయెను
బాధలన్నియు తొలగిపోయెను‖ నీవు గాక ‖
Verse
క్షణమైన నీ నామం మరువకుంటిని
మరణమైన మధురంగా ఎంచుకుంటిని‖ 2x ‖
తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని‖ 2x ‖
నా కొరకు నీవు నీ కొరకు నేను‖ 2x నీవు గాక ‖

Related Tags

WorshipDevotionalComfort