Verse 1
Reference: ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా Isaiah 9:6
Chorus
నా ప్రాణ ప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా
Verse
అధ్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్
Verse
విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా
Verse
గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా
మరచిన గాని నీవెన్నడు
మరువవు విడివవు ఎడబాయవు - కరుణారాజా
Verse
రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నా కొసగితివి
ధీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును
Verse
నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతుల తోడ
నీ ప్రేమను నే వివరింతును - విమోచకుడా
Verse
వాగ్దానముల్ నీలో నెరవేరెను - విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ