Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanamaa Aelane

నా ప్రాణమా ఏలనే

Naa Praanamaa Aelane

Verse
నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా
సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా
ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు‖ 2x ‖
నెమరేసుకుంటూ ప్రాణమా
స్తుతిపాడుమా – స్తుతిపాడుమా‖ నా ప్రాణమా ‖
Verse
నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు
నీ కొరకు సిలువలోన తాను మరణించాడు‖ 2x ‖
నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా
నీవు కూడా తన కార్యం పాటించుమా‖ 2x ‖
అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా
మరువకు సుమా – మరువకు సుమా‖ నా ప్రాణమా ‖
Verse
నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు
నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు‖ 2x ‖
నా ప్రాణమా నాలో కరిగిపోకే
నీ గతం ఏమిటో మరచిపోకే‖ 2x ‖
దినమెల్ల దేవుని దయ కోరుమా
దయ కోరుమా – దయ కోరుమా‖ నా ప్రాణమా ‖
Verse
నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు
నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు‖ 2x ‖
నా ప్రాణమా నాలో కృంగిపోకే
నీ గతం ఏమిటో మరచిపోకే‖ 2x ‖
దినమెల్ల దేవుని కృప కోరుమా
కృప కోరుమా – కృప కోరుమా‖ నా ప్రాణమా ‖

Related Tags

PraiseWorshipEncouragement