Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanamaa Digulenduku

నా ప్రాణమా దిగులెందుకు

Naa Praanamaa Digulenduku

Lyricist: Joel Kodali
Verse
నా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకో
మహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెను చూడు
లేవరా వీరుడా – నిరాశను వీడరా
నీ రాజు నిన్ను పిలిచెను – కదులు ముందుకు కదులు ముందుకు
అసాధ్యుడే నీకుండగా – అసాధ్యము నీకుండునా
భయము వీడి నడవరా – జయము నీదే జయము నీదే‖ నా ప్రాణమా ‖
Verse
యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ
యేసు నీతో ఉండును నీ సహాయమాయనే
నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు
నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును‖ 2x నా ప్రాణమా ‖
Verse
గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను
ఎదురు తిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును
జయించెనేసు ఎన్నడో సాతాను ఓడిపోయెను
నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే
నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు
నిర్భయముగా సాగిపో నిన్ను ఆపలేరు ఎవ్వరు‖ 2x నా ప్రాణమా ‖
Verse
నీవు ఎక్కలేని కొండను ఎక్కించును నీ దేవుడు
నీవు చేరలేని ఎత్తుకు నిన్ను మోయునాయనే
నీ ప్రయాస కాదు వ్యర్థము యేసు గొప్ప ఫలము దాచెను
తన తండ్రి ఇంట నీకును సిద్ధపరచెను నివాసము
ఊహించలేని మహిమతో ప్రభువు నిన్ను నింపివేయును
ఆశ్చర్యమైన స్వాస్థ్యము నీ చేతికప్పగించును‖ 2x నా ప్రాణమా ‖

Related Tags

FaithEncouragementVictoryStrength