Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanamaa Naa Samasthamaa

నా ప్రాణమా నా సమస్తమా

Naa Praanamaa Naa Samasthamaa

Lyricist: Hosanna Ministries
Verse 1
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది
Chorus
నా ప్రాణమా నా సమస్తమా
ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా‖ 2x నా ప్రాణమా ‖
Verse
పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి‖ 2x నా ప్రాణమా ‖
నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు
Verse
అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి‖ 2x నా ప్రాణమా ‖
కంటిపాపగా నీవు నన్ను కాచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
నిన్ను కొలిచెదను
Verse
నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును‖ 2x నా ప్రాణమా ‖
నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు
నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును

Related Tags

WorshipThanksgiving