Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanamaa Naalo Neevu

నా ప్రాణమా నాలో నీవు

Naa Praanamaa Naalo Neevu

Verse
నా ప్రాణమా నాలో నీవు
ఎందుకు కృంగియున్నావు
యెహోవాయందే ఇంకను
నిరీక్షణ ఉంచుము నీవు‖ 2x నా ప్రాణమా ‖
Verse
ఈతి బాధల్ కఠిన శ్రమలు
అవమానములే కలిగిన వేళ‖ 2x ‖
నీ కొరకే బలియైన యేసు
సిలువను గూర్చి తలపోయుమా‖ 2x ‖
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా‖ 2x నా ప్రాణమా ‖
Verse
ఆప్తులంతా నిను వీడిననూ
శత్రువులే నీపై లేచిననూ‖ 2x ‖
తల్లి అయినా మరచినా మరచున్
నేను నిన్ను మరువాననినా‖ 2x ‖
యేసుని ప్రేమన్ తలపోయుమా
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా‖ 2x నా ప్రాణమా ‖
Verse
ఐశ్వర్యమే లేకున్ననూ
సౌఖ్య జీవితమే కరువైననూ‖ 2x ‖
ప్రభు సేవలో ప్రాణములనే
అర్పించవలసి వచ్చిననూ‖ 2x ‖
క్రీస్తునికే అంకితమై ఆనందించు
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా‖ 2x నా ప్రాణమా ‖

Related Tags

PraiseWorshipEncouragement