Verse
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును‖ 2x ‖
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా‖ 2x నా ప్రాణమా ‖
Verse
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు‖ 2x ‖
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు‖ 2x నా ప్రాణమా ‖
Verse
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును‖ 2x ‖
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును‖ 2x నా ప్రాణమా ‖