Verse
నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము
నీ ప్రభు చేసిన మేలులలో ఒక్కదానినైన నీవు మరువకు‖ 2x ‖
అనుదినము ధ్యానించుచు
కృతజ్ఞతార్పనలు చెల్లించుము‖ 2x ‖
Verse
పాపపు ఊభిలో నీవు మునిగియుండనేల
నీ దోషములను క్షమియించి లేవనెత్తును
సమాధిలోన నీవు విసిగియున్న వేళ
నిను విమోచించి కరుణ కటాక్షముల నిచ్చును‖ 2x ‖
పక్షిరాజు యవ్వనమును దయచేసి
మేళ్ళతో నీ హృదయము తృప్తి పరచును
యేసు నామములోనే నీకు రక్షణ
యేసు నామములోనే నీకు స్వస్థత
యేసు నామములోనే నీకు నెమ్మది
యేసు నామములోనే నిలుపు నీ మది‖ నా ప్రాణమా ‖
Verse
కొండల తట్టు నీ కన్నులెత్తుము
నీ సహాయము దయచేయు దేవుడు
ఇరు వైపులా శత్రువు తరుముచున్ననూ
ఏ అపాయము దరికి చేరనీయడు‖ 2x ‖
విశ్వాస కవచమును ధరించుము
విజయ వీరుడవై ముందుకేగుము
యేసు నామములోనే నీకు విడుదల
యేసు నామములోనే నీకు క్షేమము
యేసు నామములోనే నీకు విజయము
యేసు నామములోనే నిత్యజీవము‖ నా ప్రాణమా ‖