Verse
ప్రభు నా దేవా నీ చేతి కార్యములను
ఆశ్చర్యముతో నే నించి చూడగన్
తారలజూచి గంభీర యురుములు వినగా
విశ్వమంత నీ శక్తిన్ కనుపరచన్
Chorus
నా ప్రాణమెంతో నిన్ను పాడును
గొప్ప దేవా గొప్ప దేవా
నా ప్రాణమెంతో నిన్ను పాడును
గొప్ప దేవా గొప్ప దేవా
Verse
అడవులందు నే సంచరొంచగను
పక్షుల మధుర సంగీతములు వినగా
పర్వత శోభ నే పరికించి చూడ
సెలయేరుల చల్లగాలి సోక
Verse
ప్రియసుతుని నా కొరకై చనిపోవ
పంపుట తలచి భరించ గలనా?
సిలువ పైని నా భారమంత మోసి
పాపము తీయ రక్తము కార్చెను
Verse
ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచి
పర గృహమునకు నను గొనిపోయెడు వేళ
ఆనందముతో పూజించి ప్రకటింతు
ఓ నా దేవా నీవే ఘనుడవంచు