Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanapriyudaa Naa

నా ప్రాణప్రియుడా నా

Naa Praanapriyudaa Naa

Verse
నా ప్రాణప్రియుడా నా యేసురాజా
నా యేలినవాడా నా స్నేహితుడా‖ 2x ‖
నిన్ను చేరాలని నీతో ఉండాలని‖ 2x ‖
నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం‖ 2x నా ప్రాణ ‖
Verse
నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా
నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా‖ 2x ‖
నీ ప్రేమను రుచి చూచితి
నీ వశమైతిని యేసయ్యా‖ 2x నా ప్రాణ ‖
Verse
నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా‖ 2x ‖
నిన్ను హత్తుకొని
నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా‖ 2x నా ప్రాణ ‖

Related Tags

WorshipDevotionalJesus