Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanapriyudaa Yaesu Raaja

నా ప్రాణప్రియుడా యేసు రాజా

Naa Praanapriyudaa Yaesu Raaja

Verse
నా ప్రాణప్రియుడా యేసు రాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
Verse
అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బ..హు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్‖ నా ప్రాణ ‖
Verse
విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా‖ నా ప్రాణ ‖
Verse
గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా‖ నా ప్రాణ ‖
Verse
రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును‖ నా ప్రాణ ‖
Verse
నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతాస్తు... తుల తోడ
నీ ప్రేమను నే వివరింతును విమోచకా‖ నా ప్రాణ ‖
Verse
వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ‖ నా ప్రాణ ‖

Related Tags

PraiseWorshipDevotional