Verse 1
నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతి¬మములన్ని- నీకే అర్పింతుము
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు
Verse
అడిగినంతకంటె-అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు-నీవే యేసయ్యా
పరిపూర్ణమైన-నీ దైవత్వమంతా
పరిశుద్ధతకే- శుభ ఆనవాలు‖ నా ప్రార్థన ‖
Verse
ఆపత్కాలములో మొరపెట్టగానే
సమీపమైతివే నా యేసయ్యా
సమీప భాందవ్యములన్నిటికన్నా
మిన్నయైనది నీ స్నేహబంధము‖ నా ప్రార్థన ‖
Verse
ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
ఆత్మీయతకే స్థిరపునాదులు‖ నా ప్రార్థన ‖