Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Prabhu Preminchenu Nannu Priyudaina Kreesthu Preminchenu

నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను

Naa Prabhu Preminchenu Nannu Priyudaina Kreesthu Preminchenu

Verse
నా ప్రభు ప్రేమించెను‖ 2x ‖
నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను
నాకై తానే అర్పించుకొనెను‖ 2x ‖
Verse
ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెను
యెహోవా సన్నిధిలో అర్పించెను‖ 2x మహాబలి గావించెను ‖
Verse
శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెను
దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను
Verse
మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెను
దేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను
Verse
లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకై
కడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను
Verse
ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతును
నీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును

Related Tags

SalvationSacrificeLove